schedule Monday, September 14, 2026

కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్‌ కుమార్

calendar_today June 10, 2024
person dharshininews
కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్‌ కుమార్
chai jr కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్‌ కుమార్ - బండి సంజయ్‌కి ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించి గెలిచిన కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ కిషన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా కేంద్ర క్యాబినెట్‌లో హోదా దక్కించుకోవడం పట్ల ఆయన్ను కలిసి ఘనంగా సన్మానించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరికి మంత్రి హోదా దక్కడం పట్ల రమేష్‌ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, కార్యవర్గ సభ్యులు శివరాజ్, రాష్ట్ర మహిళ మోర్చ కార్యవర్గ సభ్యురాలు సాహు శ్రీలత తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27099/