schedule Tuesday, July 07, 2026

ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..!

calendar_today August 2, 2024
person dharshininews
ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..!
ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..! - ఈఎన్సీ అనిల్‌ కుమార్‌కు మెమో - చర్చనీయాంశమైన స్పీకర్‌ ఫోన్‌ కాల్‌ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈఎన్సీకీ ఫోన్‌ కాల్ చేస్తే ఎత్తలేదంటూ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌ ఆదేశాలతో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్‌కు మెమో జారీ చేయడం చర్చనీయాంశమైంది. రెండు నెలల క్రితం గడ్డం ప్రసాద్‌కుమార్‌ వికారాబాద్‌ జిల్లాలో కోటిపల్లి వాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు సంబంధించి తాను చేసిన ప్రతిపాదనల్లోని పూడికతీత, సీసీ లైనింగ్‌ పనులు ఎందుకు తొలగించారో తెలుసుకునేందుకు ఈఎన్సీకి ఫోన్‌ కాల్స్‌ చేస్తే ఎత్తలేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎస్‌ శాంతికుమారికి లేఖ రాశారు. ప్రొటోకాల్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వివరణ పంపించాలని ఆమె నీటి పారుదల శాఖ రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్‌ కుమార్‌కు మెమో జారీ చేశారు. దీనిపై తీరికలేని విధుల్లో ఉన్నప్పటికీ ఫోన్‌ కాల్స్‌ ఎత్తినట్లు సమాధానమిచ్చిన కూడా ఈ సమాధానం సహేతుకంగా లేదని, సభాపతి ఫోన్‌కాల్స్‌ ఎత్తారా.. లేదా? అనేది స్పష్టంగా తెలియజేయాలంటూ నీటిపారుదల శాఖ కార్యదర్శి జారీచేసిన మెమోలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో ఇంజనీరింగ్ శాఖలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనిపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని అసక్తికరంగా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28001/