schedule Tuesday, July 07, 2026

స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి

calendar_today August 2, 2024
person dharshininews
స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి
స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - 5వ వార్డులో ప్రహారి గోడ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని స్మశాన వాటికల అభివృద్ధికి దృష్టి సారించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధి 5వ వార్డులోని స్మశాన వాటిక ప్రహారి గోడ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ పట్టణంలోని స్మశాన వాటికల అభివృద్ధికి దృష్టిసారిస్తున్నామన్నారు. స్మశాన వాటికలో మౌళిక వసతులు, ప్రహారీ గోడ, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పనకు నిధులు కె టాయిస్తున్నామన్నారు. అన్ని వర్గాల స్మశాన వాటికల రూపు రేఖలు మార్చేందుకు కృషి చె స్తున్నామని అన్నారు. అనంతరం పలువురు మైనార్టీ పెద్దలు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, ఖుర్షీద్ హుస్సేన్, మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28036/