schedule Tuesday, July 07, 2026

కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..!

calendar_today August 6, 2024
person dharshininews
కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..!
కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..! - ఫ్రో.జయశంకర్‌ సార్‌కు ఘన నివాళులు - టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో జయంతి  తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌లను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో ఉన్న ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణ, పలువురు జర్నలిస్టులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ తన జీవితాన్ని ధారబోసారని గుర్తుచేసుకున్నారు. పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఫ్రోఫెసర్ జయశంకర్ చేసిన కృషి అజరామరం అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన కీర్తి, స్పూర్తి ఆదర్శరంగా నిలుస్తుందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌ రూం, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మహేష్‌, వెంకటేష్‌, దోమ శ్రీను, గోపాల్(ఐ న్యూస్), గోపాల్(ఎన్‌టీవీ), కుమార్, దీపక్ ఠాకూర్, బాబార్, షబ్బీర్, గణేష్‌, రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28055/