schedule Tuesday, July 07, 2026

మిషన్‌ భగీరథ బంద్..!

calendar_today August 6, 2024
person dharshininews
మిషన్‌ భగీరథ బంద్..!
మిషన్‌ భగీరథ బంద్..! - 2,3 రోజులకోసారి నీటి సరఫరా - వికారాబాద్‌ జిల్లా అధికారుల నిర్ణయం - అంతరాయానికి కారణాలు ఎంటంటే..? వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా వాసులకు నీటి కష్టాలు మంచుకొస్తున్నాయి. ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కావున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మిషన్‌ భగీరథ అధికారులు ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్‌ భగీరథ అధికారులు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ, గ్రామాలకు 2,3 మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. కర్కల పహాడ్ నుండీ రావాల్సిన ముడి నీరు సరిపడ రాకపోవడంతో మంగళవారం నుండి త్రాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని, ప్రజలు త్రాగు నీరును పొదుపుగా వాడకుంటూ సహకరించాలని మిషన్ భగీరథ ఈఈ చల్మారెడ్డి కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28055/