schedule Tuesday, July 07, 2026

మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి

calendar_today August 6, 2024
person dharshininews
మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి
మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి - బాలికల చదువుకుకు ప్రాధాన్యం ఇవ్వాలి - మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. పట్టణంలోని గాంధీనగర్ లో ఇటీవల ప్రారంభించిన డ్వాక్రా భవనంలో సంఘాల సభ్యులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా భవనం కోసం కృషి చేసిన వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక రంగంలో మంచి ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. డ్వాక్రా భవనంలో ఆర్పీలు సమావేశాలు జరుపుకుని తమ సంఘాలలోని మహిళల అభిృద్ధికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా బాలికల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమ్మాయిలు చదువుకుంటే అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు శోభ, విజయలక్ష్మీ, మంజుల, మమిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28076/