schedule Tuesday, July 07, 2026

స్వచ్ఛదనం - పచ్చదనం సక్సెస్సే టార్గెట్..!

calendar_today August 8, 2024
person dharshininews
స్వచ్ఛదనం - పచ్చదనం సక్సెస్సే టార్గెట్..!
స్వచ్ఛదనం - పచ్చదనం సక్సెస్సే టార్గెట్..! - అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి - పారిశుద్యం, తాగునీటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి - మున్సిపల్‌లో సీడీఎంఏ ఏడీ జాన్ శ్యాంసన్‌ సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అందరు పనిచేయాలని కార్యక్రమ ప్రత్యేకాధికారి, సీడీఎంఏ ఏడీ జాన్‌ శ్యాంసన్ సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల అధ్యక్షతన అధికారులు, వార్డు ఆపీసర్లు, సిబ్బందితో స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 5 నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టారు..? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం నిరంతరం కొనసాగించే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మురికివాడల పరిశుభ్రం, చెత్త సేకరణ, రోడ్లపై గుంతల పూడిక, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, తాగునీటి శుద్దీకరణ, వరధ ముప్పు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కుక్కల దాడులు, నియంత్రణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్ పర్శన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ ప్రభత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అదే విధంగా విధంగా ఏడీ జాన్ శ్యాంసన్‌ మున్సిపల్ డంపింగ్‌ యార్డును సందర్శించారు. మొక్కల పెంపకం చేపట్టి సుందరీకరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28167/