schedule Monday, July 06, 2026

నేడు భద్రేశ్వర జాతర టెంకాయల వేలం

calendar_today March 24, 2025
person dharshininews
నేడు  భద్రేశ్వర జాతర టెంకాయల వేలం
నేడు భద్రేశ్వర జాతర టెంకాయల వేలం - ఆహ్వానించిన దేవాలయ చైర్మన్, ఈఓ - నిబంధనలు ఎలా ఉన్నాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న తాండూరు భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో టెంకాయల విక్రయానికి నేడు వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది జాతరలో టెంకాయలు విక్రయించేందుకు వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తుచేశారు. జాతర సందర్భంగా టెంకాయలు విక్రయించేందుకు నేడు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన వ్యాపారులు సమయానికంటే ముందు రూ. 5వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని స్పష్టం చేశారు. వేలం పాట పూర్తి అయిన తరువాత అత్యధికంగా పాడి వేలం దక్కించుకున్న వారు పాడిన వేలంలోని ధరలో 50శాతం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మిగతా 50శాతం చెల్లింపుకు ఏడు రోజుల గుడువు ఉంటుందని, ఆ లోగా చెల్లించి వేలం దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వ్యాపారులు వేలంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34204/