schedule Monday, July 06, 2026

ఇఫ్తార్ విందుకు తరలిరండి

calendar_today March 24, 2025
person dharshininews
ఇఫ్తార్ విందుకు తరలిరండి
ఇఫ్తార్ విందుకు తరలిరండి - బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ యూనుస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు తాండూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ తాండూరు పట్టణ అధ్యక్షులు ఎండీ యూనున్ విజ్ఞప్తి చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రేపు మంగళవారం సాయంత్రం తాండూరు పట్టణం చెన్‌గెస్‌పూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్లో ఇఫ్తార్ విధులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్య సామరస్యతను చాటేందుకు మంచి మనస్సుతో రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తాండూరు ముస్లిం సోదరులతో పాటు మాజీ ప్రజా ప్రతనిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34221/