schedule Thursday, September 10, 2026

చికెన్ షాపులను తెరుచుకుంటాం..!

calendar_today April 4, 2025
person dharshininews
చికెన్ షాపులను తెరుచుకుంటాం..!
చికెన్ షాపులను తెరుచుకుంటాం..! - దుకాణాల మూసివేతకు మినహాయింపు ఇవ్వాలి - మున్సిపల్ కమీషనర్‌కు వ్యాపారుల సంఘం విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీరామ నవమి రోజు చికెన్ షాపుల తెరుచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తాండూరు చికెన్ వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్రంలో ఏ పురపాలక సంఘం పరిధిలో చికెన్ షాపుల మూసివేత కొనసాగడం లేదని గుర్తుచేశారు. అయితే తాండూరు మున్సిపల్లో చికెన్ షాపులు మూసి వేయాలని నోటీసులు అందించారని తెలిపారు. కావున ఇతర మున్సిపల్ అమలు చేస్తున్న విధానంను తాండూరులో అమలు చేసి చికెన్ షాపుల మూసివేతకు మినహాయింపు కల్పించాలని కోరారు. చికెన్ షాపులు తెరుచుకుని యధావిధిగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఎండి యూనుస్, నరేష్, బాలరాజ్, దశరథ్, పవర్, రియాజ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34493/