schedule Thursday, September 10, 2026

రారండోయ్.. రాములోరి గుడికి..!

calendar_today April 5, 2025
person dharshininews
రారండోయ్.. రాములోరి గుడికి..!
రారండోయ్.. రాములోరి గుడికి..! - శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబు - ఇందిరానగర్ రాంమందిర్‌లో వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ రాం మందిర్‌లో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు తరలిరావాలని దేవాలయ కమిటి సభ్యులు కోరారు. శ్రీరామ నవమి సందర్భంగా దేవాలయంలో ఉత్సవాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నేడు శనివారం, రేపు ఆదివారం వేడుకలు జరుగుతాయని చెప్పారు. నేడు సాయంత్రం శ్రీరాముని డోలారోహణం(తొట్టెల) ఉంటుందని తెలిపారు. రేపు ఆదివారం ఉదయం సుహుర్తములో సీతారాముల కళ్యాణం, అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని దేవాలయంను సర్వాంగ సుందరంగా అలంకరణ చేస్తన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీరామ నవమి, సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34505/