9న అన్నదాన సత్రం ప్రారంభోత్సవం
April 6, 2025
dharshininews
9న అన్నదాన సత్రం ప్రారంభోత్సవం
- తాండూరు ఎమ్మెల్యేకు ఆహ్వానం
- పత్రిక అందించిన దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా పునర్ నిర్మిస్తున్న అన్నదాన సత్రం(దాసోహం) ప్రారంభోత్సవంకు ముహుర్తం ఖరారయ్యింది. ఈనెల 9వ తేదిన దాసోహంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం అందించారు. దేవాలయ పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 9న నిర్వహించే దాసోహ ప్రారంభోత్సవంకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, దేవాలయ కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం, సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, బస్వరాజ్, కిరణ్ కుమార్, ప్రశాంత్, వీరశైవ సమాజం సభ్యులు జొన్నల బస్వరాజ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/34538/