schedule Monday, July 06, 2026

కోట్రిక వెంకటయ్యకు నివాళులు

calendar_today April 6, 2025
person dharshininews
కోట్రిక వెంకటయ్యకు నివాళులు
కోట్రిక వెంకటయ్యకు నివాళులు - వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ భర్త, సేవారత్న స్వర్గీయ నాయకులు కోట్రిక వెంకటయ్యకు పలువురు నివాళులు అర్పించారు. ఆదివారం వారి నివాసంలో వెంకటయ్య వర్ధంతిని జరుపుకున్నారు. వెంకటయ్య వర్ధంతి సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటయ్య చిత్రపటానికి రోహిత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, కుటుంబ సభ్యులకు రోహిత్ రెడ్డి మనోధైర్యం చెప్పారు. రోహిత్ రెడ్డి వెంట నాయకులు మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తర్లపల్లి భాను, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34553/ [embed]https://www.dharshininews.com/34557/[/embed]