రేపు విద్యుత్ అంతరాయం..!
April 8, 2025
dharshininews
రేపు విద్యుత్ అంతరాయం..!
- ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు
- పవర్ కట్ అయ్యే టైం ఇదే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు బుధవారం విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ భాను ప్రసాద్ తెలిపారు. బంటారం మండలం తొర్మామిడి ఫీడర్ మరమ్మత్తుల దృష్ట్యా తొర్మామిడితో పాటు తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని గాజీపూర్, ఇందూరు, తట్టెపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పవర్ కట్ చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ అంతరాయానికి వినియోదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/34641/