schedule Monday, July 06, 2026

విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం

calendar_today April 10, 2025
person dharshininews
విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం
విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం - వెట్టిచాకిరి చేయించిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలి - బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం బాలుర వసతి గృహంలో వార్డెన్ విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించిన ఘటనపై గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయాంలో విద్యార్థును యువరాజుల్లా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులను బంతుల్లా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దేముల్ బాలుల వసతి గృహంలో విద్యార్థుల చేత పేయింటింగ్ డబ్బాలను మోపించసం వెట్టిచాకిరి చేయించినట్లే అని అన్నారు. విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయించిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34677/