ఈ చెట్టు తీయండి.. సారూ...!
April 11, 2025
dharshininews
ఈ చెట్టు తీయండి.. సారూ...!
- రోడ్డుపై అడ్డంగా తిష్ట
- రాకపోకలకు విద్యార్థులకు ఇబ్బందులు
- పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : జోరుగా వీచిన ఈదురు గాలులకు రోడ్డుపై పడిన చెట్టును తొలగించండి సారూ అంటూ స్కూల్ విద్యార్థులు కోరుతున్నారు. గురువారం సాయంత్రం జోరుగా ఈదురు గాలులు వీచాయి. ఈ భీభత్సానికి తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఓ చెట్టు రోడ్డుపై నేలకొరిగింది.
నడిరోడ్డుపై చెట్టు పడి 24 గంటలలు గడిచినా ఎలాంటి తొలగింపు చర్యలు తీసుకోలేదు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులతో పాటు స్థానికులు కూడా రోడ్డు దాటేందుకు అవస్థలు పడ్డారు. రోడ్డుపై చెట్టు పడినా కూడా మున్సిపల్ అధికారులు కాని, ఏరియా జవాన్ గాని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా రోడ్డుపై పడిన చెట్టును తొలగించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి చెట్టు తొలగిస్తారో లేదో .. మాకెం పట్టనట్లు ఉంటామని వదిలేస్తారో వేచి చూడాలి.
ఇదికూడా చదవండి....
https://www.dharshininews.com/34700/