schedule Monday, July 06, 2026

జై.. భజరంగీ..!

calendar_today April 12, 2025
person dharshininews
జై.. భజరంగీ..!
జై.. భజరంగీ..! - వైభవంగా హనుమాన్ జయంతి - తాండూరు పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర - యాత్రలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందడి - పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. భజరంగీ.. జై.. హనుమాన్ అంటూ తాండూరు పట్టణం మార్మోగింది. శనివారం హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవ సమితి, హిందూ సంఘాలు, స్టేషన్ హనుమాన్ భజనమండలిల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగవైభవంగా జరిగింది. అయోధ్య బాల రాముని విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఊరేగించారు. పట్టణంలోని స్టేషన్ హానుమాన్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమయ్యింది. స్టేషన్ హనుమాన్, మార్వాడిబజార్, భద్రేశ్వరౌ చౌక్, గాంధీచౌక్, వినాయకచౌక్, ఇందిరాచౌక్, ఐబిరోడ్, రైల్వేకాలనీల మీదుగా ఈ యాత్ర ముందుకుసాగింది. అంతకుముందు శోభాయాత్ర ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, నాయకులు, ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రో జై భజరంగీ, జై హనుమాన్ నినాదాలు మార్మోగాయి. శోభాయాత్ర సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34780/