schedule Monday, July 06, 2026

కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..!

calendar_today April 15, 2025
person dharshininews
కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..!
కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..! - లక్ష్మీనారాయణపూర్‌లో అందుబాటులోకి - రేపు ప్రారంభించనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని లక్ష్మీనారాయణ పూర్‌ గ్రామంలో హెచ్‌డీసీసీబీ బ్రాంచ్ బ్యాంకు మంజూరైంది. రేపు బుధవారం బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆర్బీఐ అనుమతితో హెచ్‌డీసీసీబీ నుంచి కొత్తగా మూడు బ్రాంచులను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా మన్నెగూడ, కుల్కచర్ల, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆర్బీఐ నుంచి లైసెన్సులు పొందారు. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ పూర్‌లో ఏర్పాటు చేస్తున్న హెచ్‌డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డీసీసీబీ జిల్లా చైర్మన్ కొత్త కురుమ నర్సయ్యతో కలిసి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బ్రాంచ్ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34856/