schedule Monday, July 06, 2026

ఘనంగా గుడ్ ఫ్రై డే

calendar_today April 18, 2025
person dharshininews
ఘనంగా గుడ్ ఫ్రై డే
ఘనంగా గుడ్ ఫ్రై డే - బెన్నూరు మెథడిస్ట్ చర్చిలో వేడుకలు - ప్రార్థనలు చేసిన ఫాస్టర్ రెవ జి సమృద్ధి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం యాలాల మండలం బెన్నూర్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రై డే శోభ సంతరించుకుంది. గుడ్ ఫ్రై డే సందర్భంగా చర్చి ఫాస్టర్ రెవ జి సమృద్ధి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసిన రోజుగా వివరిస్తూ గుడ్ ఫ్రైడే విశిష్టతను తెలియజేశారు. అందరు ఏసు మార్గాన్ని అనుసరిస్తూ ప్రపంచ శాంతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల చేసిన భక్తులు ఫాస్టర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. గుడ్ ఫ్రై డే సందర్భంగా చర్చిలో ఫాస్టర్ ప్రార్థనలు, క్రైస్తవుల కీర్తనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. క్రైస్తవుల రాకతో మెథడిస్ట్ కిటకిటలాడింది. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34942/