schedule Thursday, September 10, 2026

మందుబాబులకు షాక్..!

calendar_today April 19, 2025
person dharshininews
మందుబాబులకు షాక్..!
మందుబాబులకు షాక్..! - తాండూరులో వైన్స్‌ షాపులు బంద్ - ఎప్పటివరకు మూసిఉంటాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. తాండూరు పట్టణంలో వైన్స్‌ షాపులు మూతపడ్డాయి. పట్టణంలోని భద్రేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. శనివారం రథోత్సవం, ఆదివారం లంకాదహనం సందర్భంగా వైన్స్‌ షాపులు నిలిపివేశారు. ప్రతి యేడాది జాతర ఉత్సవాలలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాండూరులో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేశారు. పట్టణంలో తిరిగి సోమవారం యధావిధిగా మద్యం అమ్మకాలు జరుగతాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34958/