schedule Monday, July 06, 2026

రైతులను ఆదుకునేందుకు కృషి

calendar_today April 19, 2025
person dharshininews
రైతులను ఆదుకునేందుకు కృషి
రైతులను ఆదుకునేందుకు కృషి - పంటలు నష్టపోయిన వారికి పరిహారంకు దృష్టి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను కలిసిన పంటలు నష్టపోయిన రైతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అకాల వర్షంతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భరోసా అందించారు. రెండు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో కురిసన అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. శనివారం పెద్దేముల్ మండలం జనగాం, మంబాపూర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు నష్టపోయిన ధాన్యంను తీసుకవచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ వ్యవసాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయాలని, ఆధారంగా పరిహారం అందించేలా చూడాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో పంపించి నివేధిక తయారు చేయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34971/