schedule Monday, July 06, 2026

భక్తులను బ్రోవు భద్రేశ్వరా..!

calendar_today April 20, 2025
person dharshininews
భక్తులను బ్రోవు భద్రేశ్వరా..!
భక్తులను బ్రోవు భద్రేశ్వరా..! - నిత్యన్నాధానంకు కట్కం కుటుంభీకుల సేవ - సన్మానించిన రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తులను బ్రోవు భద్రేశ్వరా అంటూ తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి కట్కం వీరేందర్ కుటుంబీకులు వేడుకున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయానికి భక్తులు పొటెత్తుతున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటి నిర్వహిస్తున్న నిత్యన్నాధానికి దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఆదివారం ఆరో రోజు జరిగిన నిత్యన్నాధానంకు తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి కట్కం తిమ్మయ్య, కట్కం వీరేందర్ లు అన్నదానంకు సహాకారం అందించారు. అంతకుముందు ముందు దేవాలయంలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ కట్కం వీరేందర్, కుటుంభీకులను ఘనంగా సన్మానించారు. అనంతరం కట్కం వీరేందర్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35009/