schedule Friday, September 11, 2026

సెల్యూట్.. శంకర్ సార్..!

calendar_today April 22, 2025
person dharshininews
సెల్యూట్.. శంకర్ సార్..!
సెల్యూట్.. శంకర్ సార్..! - రోడ్డుపై పడిన చెట్ల తొలగింపు - దగ్గరుంచి తీయించిన ఎస్ఐ - సామాజిక సృహకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసులు కాఠిన్యంలో లాఠీ జులిపించడమే కాదు.. అవసరమైన సమయంలో సామాజిక సృహను చాటుకుంటున్నారు. ఇందుకు బషీరాబాద్ ఎస్ఐ శంకర్‌ నిదర్శనంగా నిలుస్తున్నారు. సోమవారం కురిసిన గాలివాన భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తాండూరు నుంచి బషీరాబాద్‌ మార్గంలోని నవల్గా సమీపంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి పడ్డాయి. ప్రతిరోజూ విధుల్లో భాగంగా ఇదే మార్గంలో బషీరాబాద్‌ పోలీస్టేషన్‌లో విధులకు హాజరు అవుతున్న ఎస్ఐ శంకర్ ఈ దృశ్యాలను చూసి చలించిపోయారు. చెట్లను తొలగించే బాధ్యత ఇతర శాఖ అధికారులది అయినప్పటికి ఎస్ఐ శంకర్ తానే స్వయంగా తొలగించేందుకు సిద్దమయ్యారు. స్థానికుల సహాకారంతో దగ్గరుండి రోడ్లపై పడిన చెట్లను పక్కకు తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ మార్గంలో వెళుతున్న వాహనదారులు, ప్రజలు ఎస్ఐ శంకర్ చేస్తున్న సామాజిక సృహకు సెల్యూట్ పలికారు. శభాష్‌ శంకర్‌ అంటూ పలువురు అధికారులు కూడా ప్రశంసించారు. గతంలో కూడా ఎస్ఐ శంకర్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కొన్ని రోజుల క్రితం ఓ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు చేయూత అందించారు. తాజాగా రోడ్లపై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చెట్లను తొలగించడం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35045/