schedule Monday, July 06, 2026

బీసీ సంఘాల పోరాటంతో కులగణన..!

calendar_today May 1, 2025
person dharshininews
బీసీ సంఘాల పోరాటంతో కులగణన..!
బీసీ సంఘాల పోరాటంతో కులగణన..! - కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాతకం - పారదర్శకంగా కులగణన చేపట్టాలి - బీసీ సంఘం జాతీయ కా.సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : జనగణనతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయని, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సహృదయంతో స్వాగతిస్తున్నామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. దేశంలోని ఓబీసీలు, బీసీ కుల సంఘాల మనోభావాలను గుర్తించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు..ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు చేసిన పోరాట ఫలితమే ఇది అని అభివర్ణించారు. కులగణనతో భవిష్యత్‌లో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తరతరాలుగా ఎదురుచూస్తున్న బీసీ మహాజనావళి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35355/