schedule Monday, July 06, 2026

వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి

calendar_today May 2, 2025
person dharshininews
వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి - తాండూరులో ముస్లిం నిరసన - పురవీధుల్లో ర్యాలీ, నినాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రం తీసుకవచ్చిన వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తాండూరులోని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరులోని ముస్లిం సంఘాల కన్వీనర్ కమల్ అతహర్, జమాత్ ఏ అహ్లే హదీస్, జమాతుల్ ఓలుమా, జమాతే ఇస్లామి హింద్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో వక్స్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఖాన్ కాలనీ నుంచి శాంత్ మహాల్ చౌరస్తా, వినాయక్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ముస్లిం పెద్దలు, రాజకీయ నాయకులు అబ్దుల్ రవూఫ్, అప్పూ(నయూం), మాజీ కౌన్సిలర్ అలీం తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు, యువకులు జాతీయ జెండాలతో పాటు నల్ల జెండాలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కేంద్రం దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు. వక్ఫ్‌ బోర్డును అణచి వేసేందుకు చట్టాలను తీసువచ్చిందని మండిపడ్డారు. కేంద్రం తీసుకస్తున్న వక్ఫ్‌ చట్టాన్ని వెంటనే వెనక్కీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35401/