schedule Monday, July 06, 2026

భళా ధీరజ్..!

calendar_today May 15, 2025
person dharshininews
భళా ధీరజ్..!
భళా ధీరజ్..! - ధార్మిక ఉపాన్యాసుకుడి యువరత్న బిరుదు - సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : అతి వయస్సులో ధార్మిక ప్రసంగాలు, గీతాపారాయణం చేస్తూ సమాజాన్ని, యువతను ప్రభావితం చేస్తున్న యువకుడు ధీరజ్‌ను భళా అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అభివర్ణించారు. తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లికి చెందిన 16 ఏండ్ల ప్రాయంలో దాదాపు 100 కి పైచిలుకు ధార్మిక ఉపన్యాసాలు, గీత పారాయణాలు జరపడం పట్ల వశిష్ట ఆశ్రమం సభ్యులు ధీరజ్ ని త్వరలో "యువరత్న" బిరుదుతో సత్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన నివాసంలో ధీరజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ధార్మిక ప్రసంగాలు, గీతా పారాయణలు చేస్తూ ధీరజ్‌ నేటి యువతకి స్ఫూర్తిదాయకంగా నిలవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తు లో ఇలాంటి ఎన్నో గొప్ప సత్కారాలు పొందడమే కాకుండా తమ ధార్మిక ప్రసంగాలతో నేటి సమాజాన్ని ప్రభావితం చేయాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35558/