schedule Monday, July 06, 2026

రేపు విద్యుత్ అంతరాయం

calendar_today May 16, 2025
person dharshininews
రేపు విద్యుత్ అంతరాయం
రేపు విద్యుత్ అంతరాయం - ప్రకటించిన విద్యుత్ అధికారులు - కరెంట్ ఉండని ప్రాంతాలు ఇవే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రతి యేడాది మాదిరిగానే వర్షాకాలం ముందు విద్యుత్ మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు డీఈ బాను ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని కరణ్ కోట్ 33 కేవీ ఫీడర్ మరమ్మత్తులతో పాటు విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల తొలగింపు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35569/