schedule Thursday, September 10, 2026

ఆపూర్వ కలయిక..!

calendar_today May 18, 2025
person dharshininews
ఆపూర్వ కలయిక..!
ఆపూర్వ కలయిక..! - ఉత్సహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - తాండూరు నంబర్ వన్ పాఠశాలలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకుని విడిపోయిన తరువాత మళ్లీ కలుసుకునే క్షణం అపురూపంగా నిలుస్తుంది. అలాంటి మధుర క్షణాలను తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల విద్యార్థులు అనుభవించారు. ఆదివారం పాఠశాలలో 2005-06లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకున్నారు. తమకు పాఠాలు, క్రమశిక్షణ నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు విద్యార్థులతో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విద్యార్థులు చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35596/