schedule Monday, July 06, 2026

హనుమతుండి ఆరాధనతో పాపాల విముక్తి

calendar_today May 22, 2025
person dharshininews
హనుమతుండి ఆరాధనతో పాపాల విముక్తి
హనుమతుండి ఆరాధనతో పాపాల విముక్తి - మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ - హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమంతుడిని ఆరాధించడం వల్ల పాపాల విముక్తి కలుగుతుందని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. గురువారం క్లిష్ట పక్షం దశమి హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతున్ని పూజించడం వల్ల మనస్సులో ధైర్యం, విశ్వాసం నిండుతాయన్నారు. స్వామి ఆరాధనతో పాపాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. స్వామి ఆశీస్సులలో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ సింహారెడ్డి, రవికుమార్, టింకు పటేల్, రమేష్, ప్రశాంత్, వెంకటేశం, ఆలయ అర్చకులు అభిషేక్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35654/