schedule Monday, July 06, 2026

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..!

calendar_today May 26, 2025
person dharshininews
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..!
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..! - ఎమ్మెల్యే నాయకత్వంలో అందరికి సముచిత స్థానం - సీతారంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ భీమలింగం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, ఎమ్మెల్యే నాయకత్వంలో అందరికి సముచిత స్థానం దక్కుతోందని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ దొరశెట్టి భీమలింగం అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు ఉన్నాయని వస్తున్న కథనాలను ఖండించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో అందరు కలిసికట్టుగా ఉన్నారని అన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవని తేల్చి చెప్పారు. పార్టీలో అందరికి ప్రాధాన్యత ఇస్తున్నారని, గుర్తింపు ఉన్న నాయకులకు పదవులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, యువకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో సమన్వయంతో పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35729/