schedule Monday, July 06, 2026

వర్షంలో వాషింగ్..!

calendar_today May 26, 2025
person dharshininews
వర్షంలో వాషింగ్..!
వర్షంలో వాషింగ్..! - బట్టలు ఉతుక్కున్న వ్యక్తి - సోషల్ మీడియాలో వీడియో వైరల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షం అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇష్టమే. వానలో తడిచేందుకు చాలా మందికి ఇష్టమే. వర్షంలో తడుస్తూ డ్యాన్స్‌లు చేయడం. క్రీడలు ఆడడం చూసే ఉంటాం. కొంత మంది వర్షంలో స్నానం చేసిన సంఘటనలు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ వ్యక్తి వర్షంలో తడుస్తూ బట్టలు వాషింగ్ చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయంత్రం వేళ తాండూరు పట్టణంలో వర్షం కురిసింది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న చౌరస్తాలో ఓ వ్యక్తి వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. కొద్ది సేపటికే నడిరోడ్డుపై కూర్చుని వేసుకున్న షర్టును విప్పేసి వర్షపు నీటిలోనే ఉతకడం ప్రారంభించాడు. రోడ్డుపైనే ఉతుకుతూ తతంగం పూర్తి చేశారు. షర్ట్‌ను రైస్‌ చేసి వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రజలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో సంఘటన వైరల్‌గా మారింది. కాగా వర్షంలో తడిసిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. వీడియో కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.. [video width="720" height="1280" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2025/05/AQOPx6XDM3VDTIGYlM6omQWPeCFKWt3MyEnpZg3pihF8pe3LfjRqAjXJn82ZxcYRU26s5P-ZCpCNEdoNbwgK_sC_.mp4"][/video] https://www.facebook.com/reel/3999589746921866   Cha ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35738/