schedule Thursday, September 10, 2026

ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా

calendar_today May 27, 2025
person dharshininews
ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా
ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా - 10వేల ఉద్యోగాల కల్పన చారిత్రాత్మకం - జాబ్ మేళాను జయప్రదం చేద్దాం - కాంగ్రెస్ సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ప్రతిష్టాత్మకంగా నిలుస్తోందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 29న తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాను జయప్రదం చేస్తామన్నారు. తాండూరు చరిత్రలో మొదటి సారి 10వేల ఉద్యోగాల కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా చారిత్రాత్మకమన్నారు. నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. ఈ జాబ్ మేళాకు స్వచ్చంద సంస్థలు, వ్యాపార సంఘాల మద్దతు తెలపాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి నిరుద్యోగిని జాబ్ మేళాకు తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిరుద్యోగుల కోసం చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35796/