schedule Monday, July 06, 2026

అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం

calendar_today May 29, 2025
person dharshininews
అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం
అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం - సన్మానించిన భద్రేశ్వర రెనవేషన్ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ - శుభకాంక్షలు తెలిపిన నేతలు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో అట్టహాసంగా జరిగాయి. గురువారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాండూరు భద్రేశ్వర రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, యువ నాయకులు బంటు వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, జోషి వికాస్‌, రాజు, బాతుల నగేష్‌ తదితరులు బుయ్యని శివకుమార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ కేక్‌ ను కట్ చేయించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు యువనాయకులు బుయ్యని శివకుమార్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా శివకుమార్ రాజకీయ, సామాజిక, వ్యాపార రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మరోవైపు బుయ్యని శివకుమార్‌కు పార్టీ నేతలు, వివిధ ప్రాంతాల కార్యకర్తలు కలిసి వెల్లువలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35826/