schedule Monday, July 06, 2026

సాయిరెడ్డిని పరామర్శించిన రమేష్ మహారాజ్

calendar_today May 29, 2025
person dharshininews
సాయిరెడ్డిని పరామర్శించిన రమేష్ మహారాజ్
సాయిరెడ్డిని పరామర్శించిన రమేష్ మహారాజ్ - కుటుంబ సభ్యులకు పరామర్శ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ సీనీయర్ రాజకీయ నేత, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ సిరిగిరిపేట్ సాయిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్ పరామర్శించారు. సాయిరెడ్డి సతీమణి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి తల్లి, మాజీ వైస్ ఎంపీపీ స్వరూప అత్తగారు సిరిగిరిపేట్ నర్సమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్ తాండూరు మండలం కోటబాస్పల్లిలోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. సాయి రెడ్డితో పాటు కుమారులు వీరేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. రమేష్ మహరాజ్ వెంట కాంగ్రెస్ సీనీయర్ నాయకులు మల్కాపూర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35836/