schedule Monday, July 06, 2026

డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి

calendar_today May 30, 2025
person dharshininews
డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి
డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి - సన్మానించిన గీతా సత్సంగ్ సేవా సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ పేదల కోసం అందిస్తున్న సేవలు మరువలేనివని తాండూరు గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు అభివర్ణించారు. డా. జయప్రసాద్ కు ఉత్తమ అవార్డు రావడం పట్ల శుక్రవారం గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం వైద్య వృత్తి ద్వారా డా. జయప్రసాద్ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆయన అందిస్తున్న సేవలకు గాను మరిన్ని ఉత్తమ అవార్డులు పొందాలని, కీర్తీ ప్రతిష్ఠలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు చల్లా నారాయణ, ప్రధాన కార్యదర్శి దేవగారి రమేష్ కుమార్, సల హాదారులు వాసు, మధుసూదన్, మాధవరెడ్డి, బస్వరాజ్, నర్సింలు, సాయిరెడ్డి, బుచయ్యా, ఆకుల కృష్ణయ్య,  కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/35857/