schedule Monday, July 06, 2026

కూల్చీవేతలు కంటిన్యూ..!

calendar_today May 30, 2025
person dharshininews
కూల్చీవేతలు కంటిన్యూ..!
కూల్చీవేతలు కంటిన్యూ..! - రేపు కూడా పట్టణంలో ఆక్రమణల తొలగింపు - తొలగింపులు చేసే ప్రాంతం ఇదే...? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ట్రాపిక్ చిక్కుల నియంత్రణలో భాగంగా మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. శుక్రవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా నుంచి బస్టాండ్ మార్గంలో రోడ్డుకు అటు, ఇటు రెండు వైపులో ఉన్న ఆక్రమణలు తొలగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణాల ముందు వెలసిన నిర్మాణాలు, షెడ్లను తొలగించారు. జేసీబీ యంత్రంలో కూల్చివేతలు కొనసాగాయి. మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహాకారంతో కూల్చివేతలను చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలను రేపు శనివారం కూడా కొనసాగించాలని మున్సిపల్ అధికారులు నిర్ణించారు. ఇప్పటికే చౌరస్తా నుంచి బస్టాండ్ మార్గంలో తొలగించగా రెండో రోజు రేపు శనివారం పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి వినాయక్ చౌరస్తా, పాత మున్సిపల్ కార్యాలయం, శాంత్ మహాల్ చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ఉన్న వ్యాపారులు, ప్రజలు తమ ఆక్రమణలు ముందస్తుగా తొలగించుకోవాలని అధికారులు సూచించారు. కాగా ఇప్పటికే వ్యాపారుల నుంచి విమర్శలు రాగా రేపటి కూల్చివేతలపై ఆసక్తి ఏర్పడింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35872/