schedule Monday, July 06, 2026

బల్దియా హైడ్రా హడల్..!

calendar_today May 31, 2025
person dharshininews
బల్దియా హైడ్రా హడల్..!
బల్దియా హైడ్రా హడల్..! - రెండో రోజు కొనసాగిన కూల్చివేతలు - స్వచ్ఛందంగా నిర్మాణాల తొలగింపు - హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహాలో తాండూరు బల్దియా అధికారులు హడలెత్తిస్తున్నారు. తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణల తొలగింపు విస్తృతంగా చేపడుతున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బంది పట్టణ పోలీసుల సహాకారంతో దుకాణాల ముందు రోడ్లపైకి వచ్చిన ఆక్రమణలు తొలగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా నుంచి విలియమూన్ చౌరస్తా మార్గంలో నిర్మాణాలను తొలగించారు. అధికారుల తొలగింపు చర్యలకు ముందే పలువురు వ్యాపారులు తమ దుకాణాలు, డబ్బలు, తోపుడు బండ్లను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. మరోవైపు ఆక్రమణల తొలగింపు విషయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వ్యాపారులు, ఆక్రమణ దారులు హడలెత్తిపోతున్నారు. ఆక్రమణల తొలగింపుతో రోడ్లు విశాలంగా కనిపిస్తున్నాయి. అధికారులు తీసుకున్న తొలగింపు చర్యల పట్ల పలువురు ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ముందస్తు సమచారం లేకుండా తొలగింపు చేయడం పట్ల విమర్శలు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో ఉన్న పలువురు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మార్గంలో వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆక్రమణల తొలగింపులో సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు అధికారులు రోడ్లపైకి రాకుండా వ్యాపారాలు చేసుకోవాలని, రోడ్లపై ఉన్న నిర్మాణాలను, ఆక్రమణలు ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35894/