schedule Monday, July 06, 2026

ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

calendar_today June 5, 2025
person dharshininews
ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి - ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం - జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్ వికారాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ ఆదేశించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావడంతో మెరుగైన బోధన అందించాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని గ్రూపులలో అడ్మిషన్లు పెంచాలన్నారు. గత సంవత్సరం ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35970/