schedule Monday, July 06, 2026

రక్తదానం చేద్దాం రండి...!

calendar_today June 6, 2025
person dharshininews
రక్తదానం చేద్దాం రండి...!
రక్తదానం చేద్దాం రండి...! - బీఆర్ఎస్వీ, రోహితన్న యువసేన పిలుపు - ఏర్పాట్లు చేసిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రక్తదానం చేసేందుకు తరలిరావాలని తాండూరు బీఆర్ఎస్వీ, రోహితన్న యువసేన సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, రోహితన్న యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తా వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుందని సందీప్ రెడ్డి తెలిపారు. రోహిత్‌ రెడ్డి అభిమానులు, యువకులు భారీగా తరలివచ్చి రక్తదానం చేసి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35983/