schedule Wednesday, September 09, 2026

మార్కండేయ స్వామి వైభోగం..!

calendar_today June 7, 2025
person dharshininews
మార్కండేయ స్వామి వైభోగం..!
మార్కండేయ స్వామి వైభోగం..! - ఘనంగా దేవాలయ వార్షికోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శనివారం పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రాకతో దేవాలయం కిక్కిరిసి పోయింది. మరోవైపు సమాజం ఆధ్వర్యంలో పది, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలి సమాజం విద్యార్థులతో పాటు మార్కండేయ కాలనీకి చెందిన విద్యార్థులకు అభినందనలు, సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజం సభ్యులు, మార్కండేయ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36035/