schedule Monday, July 06, 2026

ప్రైవేటు దోడిపిపై చర్యలు తీసుకోండి

calendar_today June 18, 2025
person dharshininews
ప్రైవేటు దోడిపిపై చర్యలు తీసుకోండి
ప్రైవేటు దోడిపిపై చర్యలు తీసుకోండి - తాండూరు ఎంఈఓకు బీసీ జేఏసీ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో దోపిడికి పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి ప్రభుత్వ పాఠ్యాంశాలను బోధించాల్సి ఉండగా ఐఐటీ, లీడ్ యాప్ వంటి సిలబస్ ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త సిలబస్ ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దోపిడికి పాల్పడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు భాను ప్రసాద్, సాయికుమార్, మహేష్ కుమార్, మనోహర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/36239/