schedule Monday, July 06, 2026

ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..!

calendar_today June 20, 2025
person dharshininews
ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..!
ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..! - గడువు పొడగించిన సర్కారు - 25శాతం రాయితీపై క్రమబద్దీకరణకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎల్ఆర్ఎస్‌కు మరో అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అనమతి లేని ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్లు క్రమబద్దీకరించాలనే ఉద్దేశంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను అమలు చేస్తోంది. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 10వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని గతంలో అధికారులు వెల్లడించారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో రూ.1000లు చెల్లించిన దరఖాస్తులు దారులు రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఈయేడాది ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పిస్తూ వస్తోంది. చిరవగా మే నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఆ తరువాత కూడా కొందరు లేఅవుట్ల క్రమబద్దీకరణ చేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. తాజాగా ప్రభుత్వం అధికారికంగా ఎల్ఆర్‌ఎస్‌ గడువును పొడగించింది. ఈనెల ఆఖరు వరకు రెగ్యులైజేషన్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్‌ను వినియోగించుకోలేని వారికి ఈ అవకాశంతో ఊరట కలగనుంది. పూర్తి వివరాలకు మున్సిపల్‌లోని హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించవచ్చు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36242/