schedule Monday, July 06, 2026

తీర్థయాత్ర భక్తులకు ఆర్టీసీ ఆఫర్

calendar_today June 20, 2025
person dharshininews
తీర్థయాత్ర భక్తులకు ఆర్టీసీ ఆఫర్
తీర్థయాత్ర భక్తులకు ఆర్టీసీ ఆఫర్ - తాండూరు నుంచి శ్రీశైలంకు ప్యాకేజ్ టూర్ - రూ. 1700తో ఆరు పుణ్య క్షేత్రాలకు సర్వీసు - ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తీర్థయాత్రలతో పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం తాండూరు ఆర్టీసీ అధికారులు ఓ ఆఫర్ ప్రకటించారు. తాండూరు నుంచి స్పెషల్ ప్యాకేజీ టూర్ సదుపాయం కల్పించడం జరుగుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈనెల 28 నుంచి తాండూరు టు శ్రీశైలంకు స్పెషల్ డీలక్స్ బస్సు సర్వీసు నడిపించడం జరుగుతుందని చెప్పారు. తాండూరు నుంచి జోగులాంబ ఆలయం, మహానంది ఆలయం, శ్రీశైలం, శ్రీశైలంలోని సాక్షి గణపతి, పాలధార- పంచదార, శిఖరేశ్వరం, డ్యాం సెట్, పాతాళగంగతో పాటు ఉమామహేశ్వరంతో కలిపి మొత్తం ఆరు పుణ్య క్షేత్రాలకు ఈ సర్వీసు నడుస్తుందని తెలిపారు. 28వ తేదిన శనివారం ఉదయం 4గంటలకు తాండూరు నుంచి బయల్దేరి 29న రాత్రి 10గంటలకు సర్వీసు పూర్తవుతుందని తెలిపారు. ఈ సర్వీసులో ఒక్కో ప్రయాణికుడికి రూ.1700ల ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. తాండూరుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు బస్టాండ్లో లేదా సెల్: 9959226251, కాల్ సెంటర్: 04069440000, 04023450033లకు సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36287/