schedule Monday, July 06, 2026

స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్

calendar_today June 20, 2025
person dharshininews
స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్
స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్ - తనిఖీలు నిర్వహించిన పోలీసులు - నిబంధనలు పాటించాలని యజమానులకు ఆదేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్ ఫిట్ నెస్ లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాల మేరకు సబ్ డివిజన్ లోని తాండూరు పట్టణం, బషీరాబాద్, పెద్దేముల్, కరణ్ కోట్ పోలీస్టేషన్లకు చెందిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా పాఠశాలలకు చెందిన బస్సులను పరిశీలించి వాటి ఆర్సీలు, పర్మిట్, ఫిట్ నెస్, పోల్యూషన్ వంటి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు పాఠశాలల యజమాన్యంతో పాటు వాహనాల యజమానులకు సూచనలు చేశారు. యజమానులు లైసెన్సులు కలిగిన డ్రైవర్లను విధుల్లో ఉంచుకోవాలని, సీట్ల సామార్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్లు, విద్యార్థులు రోడ్డు నిబంధనలు. భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36290/