schedule Monday, July 06, 2026

ఒకే ఈతలో రెండు లేగదూడలు

calendar_today June 20, 2025
person dharshininews
ఒకే ఈతలో రెండు లేగదూడలు
ఒకే ఈతలో రెండు లేగదూడలు - 18గంటల వ్యవధిలో జననం - సేవలందించిన 1962 సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ ఆవుకు ఒకే ఈతలో రెండు లేగదూడు జన్మించాయి. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సీతారాంపేట్ కు చెందిన కార్మిక నాయకుడు ఎం.గోపాల్ గో సేవలో భాగంగా మూడు ఆవులను పోషిస్తున్నారు. ఇందులో ఓ ఆవు ప్రసవానికి సిద్ధంగా ఉండింది. ఈనెల 18న ఆవు ప్రసవానికి ఇబ్బందులు పడడంతో 1962 సిబ్బందికి గోపాల్ సమాచారం అందించారు. తాండూరు గోశాల సేవా సమితికి కూడా తెలిపారు. తాండూరు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కోడంగల్ కు చెందిన సిబ్బంది తాండూరుకు చేరుకుని ఆవుకు ప్రసూతి సేవలు అందించారు. అదే రోజు ఆవు ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అదే ఆవు 18 గంటల తరువాత 19వ తేదిన మరో లేగదూడకు జన్మనిచ్చింది. దీంతో ఆవుకు ఒకే ఈతలో రెండు లేగదూడలు జన్మించాయి. 1962 వైద్య సిబ్బంది పర్యవేక్షణలో, గోశాల సేవా సమితి సేవకుల తోడ్పాటుతో గోవుకు ప్రసవ సేవలు అందించారు. ప్రస్తుతం గోవు, రెండు లేగదూడలు క్షేమంగా ఉన్నాయి. ఆవు ప్రసవానికి సేవలు అందించిన 1962 సిబ్బందికి, గోశాల సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36294/