schedule Monday, July 06, 2026

కూల్చి వేతలు.. మళ్లీ మొదలు..!

calendar_today June 24, 2025
person dharshininews
కూల్చి వేతలు.. మళ్లీ మొదలు..!
కూల్చి వేతలు.. మళ్లీ మొదలు..! - రోడ్లపై ఆక్రమణల తొలగింపు - ఇందిరా చౌరస్తా, చించొల్లి మార్గంలో చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రోడ్లపై ఆక్రమణల కూల్చివేతల కార్యక్రమం మళ్లీ మొదలైంది. మంగళవారం ఉదయం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా నుంచి చించొల్లి రోడ్డు మార్గంలో నిర్మాణాలను తొలగించారు. అధికారులు తొలగింపు చర్యలకు ముందే పలువురు వ్యాపారులు తమ దుకాణాలు, డబ్బలు, తోపుడు బండ్లను స్వచ్చందంగా తొలగించుకున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న సైడ్ డ్రైన్ లపై పలువురు వ్యాపారులు దుకాణాల ముందు షెడ్లు, ఇతర నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతనెల చివర్లో మున్సిపల్ అధికారులు కూల్చివేతప్రారంభించారు. పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇందిరా చౌరస్తా నుంచి చించొల్లి రోడ్డు మార్గంలో మళ్లీ కూల్చివేతలను ప్రారంభించారు. మున్సిపల్ కు చెందిన టౌన్ ప్లానింగ్, జవాన్లు ఆక్రమణలు తొలగించారు. ఆక్రమణల తొలగింపులు వ్యాపారులు స్వచ్చందంగా సహకరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36419/