schedule Monday, July 06, 2026

తాండూరులో గంజాయి పట్టివేత

calendar_today June 25, 2025
person dharshininews
తాండూరులో గంజాయి పట్టివేత
తాండూరులో గంజాయి పట్టివేత - సుమారు 1 కిలోన్నర స్వాదీనం - దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. ప్రాథమిక సమాచారం |మేరకు తాండూరు పట్టణం ముర్షద్ దర్గా ప్రాంతానికి చెందిన రఫీక్ అనే యువకుడు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ స్కూల్ సమీపంలో నిందితుడు రఫీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 1కిలోన్నర గంజాయి ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకవచ్చి ఇక్కడ విక్రయాలు చేపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు జరిపిన తరువాత పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36427/