schedule Monday, July 06, 2026

మత్తు జోలికి పోవద్దు..!

calendar_today June 26, 2025
person dharshininews
మత్తు జోలికి పోవద్దు..!
మత్తు జోలికి పోవద్దు..! - బానిసలైతే జీవీతాలు నాశసం - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - పట్టణంలో యాంటీ డ్రగ్ డే ర్యాలీ తాండూరు దర్శిని ప్రతినిధి : మత్తు జోలికి వెళ్లి.. జీవితాలను నాశసం చేసుకోరాదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం(యాంటి డ్రగ్ డే) సందర్బంగా పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కాలేజీ నుంచి మున్సిఫ్ కోర్టు, అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా, పోలీస్టేషన్ వద్దకు చేరుకుంది. ర్యాలీలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, డా.జయప్రసాద్ లు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అవగాహన కల్పించారు. మత్తుకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని అన్నారు. కావున ఎవ్వరు మత్తు జోలికి పోరాదని అన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ర్యాలీతో విద్యార్థులు కాలేజీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36458/