schedule Monday, July 06, 2026

హ్యాండ్ బ్యాగులో గంజాయి..!

calendar_today June 27, 2025
person dharshininews
హ్యాండ్ బ్యాగులో గంజాయి..!
హ్యాండ్ బ్యాగులో గంజాయి..! - యువకుడి నుంచి 1.2కిలోలు స్వాదీనం - కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు - వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : హ్యాండ్ బ్యాగులో గంజాయి ఉంచుకున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో సీఐ సంతోష్ కుమార్ ఎస్ఐ అంబర్యా, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగును పరిశీలించగా అందులో 1.2కిలో ఎండు గంజాయి లభించింది. వెంటనే యువకున్ని అదుపులోకి తీసుకుని విచారించగా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లాల్ మహమ్మద్ అని గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. పూర్తి విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. స్వాదీనం చేసుకున్న 1.2కిలో గంజాయి రూ. 30వేలు విలువ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఎవ రైనా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుళ్లు అంజద్, శివకుమార్, కానిస్టేబుళ్లు సాయప్ప, షబ్బీల్ లను అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36475/