schedule Monday, July 06, 2026

తాండూరు పట్టణంలో మట్కా దందా

calendar_today June 27, 2025
person dharshininews
తాండూరు పట్టణంలో మట్కా దందా
తాండూరు పట్టణంలో మట్కా దందా - గుట్టు రట్టు చేసిన పోలీసులు - ఇద్దరు మట్కారాయుళ్లపై కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ తాండూరు పట్టణ నడిబొడ్డున నిర్వహిస్తున్న మట్కా దంగా గుట్టును స్థానిక పోలీసులు రట్టు చేశారు. గుట్టుగా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన షేక్ అబ్దుల్ సత్తార్, ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీలు పట్టణంలోని వినాయక చౌరస్తా ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 4120లు, మట్కా చిట్టీలను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత మట్కా జూదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో ఎవరైనా మట్కా నిర్వహిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36482/